Jyothula Nehru
Jyothula Nehru – TDP: ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ(Kakinada) లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో తాము ముందుకు వెళ్తామని అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పలేని దుస్థితి వైసీపీలో ఉందని, వారిలా తాము చీకట్లో వెళ్లి జాతీయ నేతలను కలవబోమని జ్యోతుల నెహ్రూ అన్నారు. వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జగన్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. జగన్ పాలనలో నాలుగేళ్లుగా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టయినా పూర్తి చేశారా అని నిలదీశారు. 2030 వరకు పోలవరం పూర్తి కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు.
రైతులను జగన్ మోసం చేస్తున్నారని చెప్పారు. రైతులను మోసం చేస్తే ఆయన సర్వనాశనం అయిపోతారని అన్నారు. కాగా, ఎన్డీఏలో టీడీపీ మళ్లీ చేరుతుందని ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ నిర్వహిస్తున్న సమావేశానికి ఇప్పటికే టీడీపీకి ఆహ్వానం అందించింది. వచ్చే ఏడాది ఏపీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
Nagul Meera : సజ్జల రామకృష్ణారెడ్డి నేరస్థులను కాపాడుతున్నారు.. నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు