Kanna Lakshminarayana : సహకార రంగంలో రూ.5 వేల కోట్ల అవినీతి, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని వైసీపీ నేతలు దోచేస్తున్నారు : కన్నా

రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్నాయో లేవో రైతులంతా చెక్ చేసుకోవాలి.

Kanna Lakshminarayana

TDP Leader Kanna Lakshminarayana : వైసీపీ నేతలపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana)సంచలన ఆరోపణలు చేశారు. రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు (ycp leaders)రుణాలు తీసుకుంటున్నారని..రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారని అంటూ ఆరోపించారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఈ దోపిడీపై సీబీఐ (CBI) విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తమ భూములు సురక్షితంగా ఉన్నాయో లేవో రైతులంతా చెక్ చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులకు కన్నా సూచించారు.

సహకార బ్యాంకుల్లో (cooperative society) రైతులు చేసిన డిపాజిట్ల (Farmers deposits) కూడా తీసేస్తున్నారని..ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వైసీపీ నేతల వరకూ ఇందులో వాటాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది అధికారులు కూడా ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నారని అన్నారు. సహకార రంగంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని.. అమిత్ షా (Amit Shah)సహా కేంద్ర రంగ సంస్థలకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Nara Lokesh : జగన్ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది : నారా లోకేశ్

సహకార సొసైటీల్లో అవినీతిపై ఉన్న ఆధారాలను బయటపెడుతున్నామన్నారు. సహకార రంగంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినా పట్టించుకునే నాథులు కరవయ్యారనీ…ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సహకార రంగంలో జేబు దొంగలు చేరారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సొసైటీల్లో త్రిసభ్య కమిటీల మాటున రైతుల సొమ్మును విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల్ని సహకార పదవుల్లో నామినేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై కేంద్రం స్పందించి చర్యలు తీసుకోవాలిన లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు చూసి డీజీపీ (DFP) సిగ్గుపడాలన్నారు. ముఖ్యమంత్రిగా ఆ పదవిలో కూర్చునే అర్హత జగన్మోహన్ రెడ్డి (jaganmohan reddy)ఎప్పుడో కోల్పోరంటూ విమర్శించారు.

Buddha Venkanna : సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే సీఎం జగన్ ఎందుకు స్పందించట్లేదు : బుద్ధా వెంకన్న

చెరుకపల్లి ఘటన సహా ఇతరత్రా నేరాల పట్ల మంత్రులతో పాటు సీఎం జగన్ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ కన్నా విమర్శలు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ (Sattenapally DSP) మంత్రి అంబటి రాంబాబు (Minister ambati rambabu) ఇంట్లో గుమాస్తాలా పని చేస్తున్నారని..మంత్రి అంబటి చెప్పినట్టే డీఎస్పీ వింటున్నారని అన్నారు. అంబటి సూచనలతోనే సత్తెనపల్లి డీఎస్సీ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. సత్తెనపల్లి డీఎస్పీ వ్యవహరం గురించి త్వరలో డీజీపీని కలుస్తానని తెలిపారు. సత్తెనపల్లిలోనే కాదు.. చాలా చోట్ల డీఎస్పీలు అధికార పార్టీ నేతల ఇళ్లల్లో చప్రాసీల్లా పని చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికార పార్టీకి సహకరించాలని డీఎస్పీలకు డీజీపీ సూచిస్తున్నారా..? అంటూ కన్నా ప్రశ్నించారు.


 

ట్రెండింగ్ వార్తలు