Varla Ramaiah : జగన్‌ను పడగొట్టి సీఎం అవ్వాలనుకున్నారు, వెంటనే అరెస్ట్ చేయాలి- మాజీమంత్రి పెద్దిరెడ్డిపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబ వికృత చేష్టలు చూసీ చూడనట్టు ఉండకపోతే అంతే సంగతులు అన్నారు.

Varla Ramaiah : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎక్కడికీ పారిపోకుండా తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎం చంద్రబాబుని కోరారు. పెద్దిరెడ్డి, ఆయన భార్య, తనయుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారాకానాథ్ రెడ్డి నలుగురూ అరెస్ట్ కావాల్సిందేనని ఆయన అన్నారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద పెద్దిరెడ్డి కుటుంబంపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

విదేశాలకు పారిపోకుండా పాస్ పోర్టులు సీజ్ చేయాలి..
అటవీ భూములతో ఆటవిక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్న పెద్దిరెడ్డి.. తప్పు చేయలేదనటానికి వీల్లేదన్నారు. విజిలెన్స్ నివేదికలో అన్ని సాక్ష్యాలు బయటపడ్డాయని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేసేందుకు అన్ని అవకాశాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని వర్ల రామయ్య చెప్పారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు విదేశాలకు పారిపోకుండా తక్షణమే ఆ నలుగురు పాస్ పోర్టులు సీజ్ చేయాలన్నారు.

Also Read : అలా చేయకపోతే.. 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారు- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్

అన్నింటిలో పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీ సాగింది..
అవకాశం ఉంటే జగన్ ని పడగొట్టి తాను ముఖ్యమంత్రి అవ్వాలనేట్టుగా పెద్దిరెడ్డి గత ఐదేళ్లు సంపాదించారని వర్ల రామయ్య ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుందన్నారు. ప్రభుత్వ భూములు, ఖనిజ సంపద, ఇసుక, పేదల భూములు, అటవీ భూముల, ఎర్ర చందనం, మద్యం, గనుల లీజులు ఇలా అన్నింటిలో పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీ సాగిందని ఆరోపించారు.

Also Read : నవ్వుల పాలైంది చాలదా? ఏపీ జధానిపై వైసీపీ వైఖరేంటి, ఇంకా తమ స్టాండ్ ఏంటో చెప్తామనడంలో ఆంతర్యమేంటి..

అసాంఘిక కార్యక్రమాల్లో ఆరితేరిన కుటుంబం..
అసాంఘిక కార్యక్రమాల్లో పెద్దిరెడ్డిది ఆరితేరిన కుటుంబం అన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబ వికృత చేష్టలు చూసీ చూడనట్టు ఉండకపోతే అంతే సంగతులు అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం అరెస్ట్ అవుతుందనే నమ్మకంతోనే పార్టీ ఆఫీస్ కు ఆయన బాధితులు పోటెత్తారని వర్ల రామయ్య తెలిపారు. ప్రతీ ఫిర్యాదుకు న్యాయం జరిగేలా పార్టీ కేంద్ర కార్యాలయం సిఫార్సుతో ఉన్నతాధికారులకు పంపి పర్యవేక్షిస్తామన్నారు వర్ల రామయ్య.