Raghu Rama Krishna Raju : అలా చేయకపోతే.. 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారు- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్

ఆయన ప్యాలెస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వాలట. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే అంత సమయం జగన్ కి ఇవ్వాలట. అదెలా సాధ్యం?

Raghu Rama Krishna Raju : అలా చేయకపోతే.. 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారు- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్

Updated On : February 10, 2025 / 6:16 PM IST

Raghu Rama Krishna Raju : వైసీపీ చీఫ్ జగన్ తీరుపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ ఫైర్ అయ్యారు. కోర్టు సమన్లు ఇచ్చిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జగన్ పై మండిపడ్డారు. జగన్ కూడా ఎమ్మెల్యేల అవగాహన సదస్సులో పాల్గొనాలన్నారు.

అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు హాజరుకావాల్సిందే..
ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నేతల ప్రవర్తన బాగుండాలని హితవు పలికారాయన. సభను హుందాగా జరిపేందుకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గౌరవ సభగా ఉండేందుకు అన్ని పార్టీల సభ్యులకు అవగాహన కార్యమాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్టీల శాసన సభా పక్ష నేతలు అవగాహన కార్యక్రమానికి హాజరుకావాల్సిందేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తేల్చి చెప్పారు.

Also Read : కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్.. తప్పించుకు తిరుగుతున్న ఆమెను పోలీసులు ఎలా దొరకబట్టారో తెలుసా?

60 రోజులు శాసనసభకు రాకపోతే వారి సభ్యత్వం రద్దు చేయొచ్చు..
”అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకి ఇచ్చే సమయమే తనకూ ఇవ్వాలని జగన్ కోరడం సరికాదు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదానే లేదు. ముందుగా.. అసెంబ్లీ నియమాలు, నిబంధనలను తెలుసుకోవాలి. అనుమతి తీసుకోకుండా 60 రోజులు శాసనసభకు రాకపోతే వారి సభ్యత్వం రద్దు చేయొచ్చు. ఈ మేరకు రాజ్యాంగంలో రూల్స్ ఉన్నాయి” అని డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు అన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ సెలవు కోరలేదు..
”60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా గైర్హాజరైతే ఆర్టికల్ 190(4) ప్రకారం అనర్హుడవుతారు. అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ సెలవు కోరలేదు. సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే దానిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అలా లేకపోతే 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారు. ఎవరి లీవ్ లెటర్ వాళ్ళే ఇవ్వాలి” అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.

చంద్రబాబుకి ఇచ్చినంత టైమ్ జగన్ కు ఎలా ఇస్తారు?
”స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సభకు రావాలని జగన్ ను కోరా. ఆయన ప్యాలెస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వాలట. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే అంత సమయం జగన్ కి ఇవ్వాలట. అదెలా సాధ్యం? జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. రూల్స్ ప్రకారమే మేము నడుచుకుంటున్నాం. మేము గౌరవప్రదంగానే వ్యవహరిస్తున్నాం” అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు.

Also Read : నవ్వుల పాలైంది చాలదా? ఏపీ జధానిపై వైసీపీ వైఖరేంటి, ఇంకా తమ స్టాండ్ ఏంటో చెప్తామనడంలో ఆంతర్యమేంటి..

జగన్ కోసం కొత్త రాజ్యాంగం రాద్దామా? కొత్త రూల్స్ పెడదామా? ఆయనకు ఉన్నది 11 మంది. ప్రతిపక్ష నాయకుడి హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. జగన్ రాడు, ఆ 10 మంది ఎమ్మెల్యేలను రానివ్వడు. వారు తమ సమస్యలను అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా జగన్ ఇవ్వడం లేదు. నీతో పాటు వారిని కూడా రానివ్వడం లేదు.

తమ నియోజకవర్గాల్లో సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు పార్టీ లీడర్ గా అవకాశం ఇవ్వాలి కదా. జగన్ తీరు చాలా తప్పు. ఇది పద్ధతి కాదు. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం నేను నడుచుకోవాలి. నేను స్పీకర్ కాబట్టి నా ఇష్టం వచ్చిన నిర్ణయాలు నేనెలా తీసుకుంటాను? ఉన్న సంఖ్యలో 18 మంది బలం ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదని న్యాయ నిపుణులు తేల్చి చెప్పారు” అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.