Deputy Speaker : యువగళం సభలో అనుభవాలు చెప్పడం కన్నా జగన్ ను విమర్శించడమే ఎక్కువ : డిప్యూటీ స్పీకర్

రాష్ట్ర నలుమూలల నుండి జనాన్ని సమీకరించుకుంటే తప్ప సభ జరుపుకోలేక పోయారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.

Deputy Speaker : యువగళం సభలో అనుభవాలు చెప్పడం కన్నా జగన్ ను విమర్శించడమే ఎక్కువ : డిప్యూటీ స్పీకర్

Kolagatla Veerabhadra Swamy

Updated On : December 21, 2023 / 11:55 AM IST

Deputy Speaker Kolagatla Veerabhadra Swamy : యువగళం సభలో అనుభవాలు చెప్పడం కన్నా జగన్ ను విమర్శించడమే ఎక్కువని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. పవన్ రానంటే బ్రతిమిలాడి సభకు తెచ్చిన దుస్థితి చంద్రబాబుకి పట్టిందని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన గురువారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.

2014 ఎన్నికల తరువాత టీడీపీ ఓటు అడిగే హక్కు కోల్పోయారని తెలిపారు. జనం రారని సినీ ఇమేజ్ కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. అధికార దాహంతో ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ లేకపోతే సభకు ప్రజలు వచ్చే పరిస్థితి లేదన్నారు.

Kadiyam Srihari : ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య : కడియం శ్రీహరి

రాష్ట్ర నలుమూలల నుండి జనాన్ని సమీకరించుకుంటే తప్ప సభ జరుపుకోలేక పోయారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు టీడీపీకి మాత్రం ప్రజా సమస్యలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు.