Kadiyam Srihari : ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య : కడియం శ్రీహరి
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరుద్యోగ భృతిపై మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.

MLA Kadiyam Srihari
Kadiyam Srihari Criticize Congress : కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని తెలిపారు. నెలకు 4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కానీ, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరుద్యోగ భృతిపై మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. రైతులు రెండు లక్షల రుణం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని తెలిపారు.
Parliament : పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్
ధాన్యంకు మద్దతు ధరతో పాటు రు.500 బోనస్ ఇస్తామన్నారని వెల్లడించారు. ఈ మూడు హామీలపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు.