TDP MlC Ashok Babu : ఉద్యోగులకు 4 శాతం జీతాలు తగ్గుతాయి..పే రివిజన్ కాదు, పే రివర్స్

నాలుగు శాతం జీతాలు తగ్గుతాయంటున్న అశోక్‌బాబు వాదనతో ఉద్యోగ సంఘాల నేతలు ఏకీభవించట్లేదు. ఆశించిన స్థాయిలో ఫిట్‌మెంట్‌ రాకపోయినా...

AP PRC : ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 27 శాతం ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటే 23 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు తగ్గినట్లేననే వాదనను తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. ఇది పే రివిజన్‌ కాదు..పే రివర్స్‌ అంటూ కామెంట్ చేశారు. పీఆర్సీ ప్రకటనతో ఉద్యోగులకు ఏమాత్రం లాభం ఉండదని, ఇది ఆత్మవంచన చేసుకోవడమేనన్నారు.

Read More : Corona : తెలంగాణ సచివాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్

నాలుగు శాతం జీతాలు తగ్గుతాయంటున్న అశోక్‌బాబు వాదనతో ఉద్యోగ సంఘాల నేతలు ఏకీభవించట్లేదు. ఆశించిన స్థాయిలో ఫిట్‌మెంట్‌ రాకపోయినా… పెండింగ్‌ డీఏలన్నీ ఈ నెల జీతంతో కలిపి ఇస్తామనడం, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ బెనిఫిట్స్‌ మాత్రమే కాకుండా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలకు పరిగణనలోకి తీసుకుని 23 శాతం ఫిట్‌ మెంట్‌కు ఒప్పుకున్నామన్నారు.

Read More : Selfie Video : రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సెల్ఫీ వీడియో.. సంచలన విషయాలు వెల్లడి

పలు దఫాల చర్చల తర్వాత పీఆర్సీని ప్రకటించారు సీఎం జగన్. 23 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వంపై 10 వేల 247 కోట్ల భారం పడనుంది. ఐఆర్‌ 27 శాతం ప్రకటించాక.. 23 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు నాలుగు శాతం తగ్గుతాయన్న వాదనను కొందరు వినిపిస్తున్నారు. తగ్గిన ఫిట్‌మెంట్ ప్రభావంతో డీఏలు, హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు 34 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టారు. కానీ కమిటి 14.29 శాతం సిపారసు చేయడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది.

Read More : India Covid : భారత్‌‌లో కరోనా సునామీ రాబోతుందా ? తస్మాత్‌ జాగ్రత్త..అంటున్న సైంటిస్టులు

దీంతో సీఎం జగన్‌.. ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి వరుసగా రెండు రోజులు చర్చించారు. కరోనా కాలంలో ప్రభుత్వ ఖజానా పరిస్థితిని వివరిస్తూ.. కమిటి సిఫారసు చేసిన దానికన్నా 9 శాతం ఎక్కువగా ఇస్తున్నామంటూ 23 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించేలా ఒప్పించారు. ఉద్యోగుల సమస్యలన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, డిమాండ్లను నెరవేరుస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని మంచి ఫిట్‌మెంట్‌గానే భావిస్తున్నామంటూ పలు ఉద్యోగసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు