India Covid : భారత్‌‌లో కరోనా సునామీ రాబోతుందా ? తస్మాత్‌ జాగ్రత్త..అంటున్న సైంటిస్టులు

శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యేలానే భారత్‌లో రోజువారీ కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఒక్కరోజే దేశంలో లక్షా 41 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి.

India Covid : భారత్‌‌లో కరోనా సునామీ రాబోతుందా ? తస్మాత్‌ జాగ్రత్త..అంటున్న సైంటిస్టులు

Covid 18

Covid Third Wave : కొన్ని వారాల్లోనే భారత్‌లో కరోనా సునామీ రాబోతుందా ? అమెరికా రోజువారీ కేసుల సంఖ్యను భారత్‌ మించనుందా..? సెకండ్‌వేవ్‌కు మించిన కేసుల కల్లోలాన్ని భారత్‌ చవిచూడనుందా..? సైంటిస్టులు ఏం చెబుతున్నారు..? కేంబ్రిడ్జ్‌ వర్శిటీ పరిశోధకుల నుంచి మన కేంద్ర ప్రభుత్వ పరిశోధనా బృందం వరకు అందరిది ఒక్కటే అంచనా..! అదే నిజమైతే భారత్‌పై రానున్న కొద్దీ రోజుల్లోనే కరోనా ఉప్పెనలా విరుచుకుపడక తప్పదు..! అవును..! రోజువారీ కేసుల రికార్డులో అమెరికాకు మించిన కేసులు భారత్‌లో నమోదవనున్నాయట..! ఊహించని ఈ ఉపద్రవానికి ఆరోగ్య వ్యవస్థలు ముందుగానే అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతులంటున్నారు సైంటిస్టులు. తస్మాత్‌ జాగ్రత్త..! ముందుంది అసలుసిసలైన కరోనా కేసుల ముసళ్ల పండగ..! భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ సృష్టించిన ప్రళయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కరోనా సెకండ్‌వేవ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు రోజుకు 4లక్షల కంటే ఎక్కవ కేసులు రికార్డయ్యాయి.

Read More : Australia : రోబోతో లవ్..పెళ్లి చేసుకోవాలని ఉందంట

మునుపెన్నడూ చూడని కేసుల విధ్వంసమది..! కరోనా ఉధృతి ధాటికి దేశ ఆరోగ్య వ్యవస్థ సైతం చేతులెత్తేసింది. నిత్యం లక్షల్లో కరోనా బారిన పడడం.. వేల మంది కరోనాకు బలికావడం చూస్తుండగానే జరిగిపోయింది. కరోనా రోగులతో ఆస్పత్రుల్లో పడకలు నిండిపోయాయి. ఈ సారి దానికి మించిన స్థాయిలో కేసులు విలయం తప్పదంటున్నారు సైంటిస్టులు. అయితే ఆస్పత్రుల్లో చేరిక అంతంతమాత్రంగానే ఉంటుందంటూ కాస్త్‌ రిలీఫ్‌ ఇస్తున్నారు. కేసుల నమోదులో మరికొద్దీ రోజుల్లోనే సెకండ్‌వేవ్‌ రికార్డులను భారత్‌ బద్దలుకొడుతుందంటున్నారు.

Read More : Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం

సెకండ్‌వేవ్‌ రికార్డుల సంగతి అటు ఉంచితే.. అంతకు మించిన కేసుల కల్లోలంపై సైంటిస్టులు తాజాగా చేసిన మరో హెచ్చరిక మరింత గుబులు రేపుతోంది. అమెరికాలో రోజువారీ కేసులు ఎంత భారీ స్థాయిలో రికార్డవుతున్నాయో చూస్తున్నారు కదా..? రోజుకు దాదాపు 7 నుంచి 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లో అంతకుమించిన కేసులు రికార్డవడం ఖాయంగా చెబుతున్నారు సైంటిస్టులు. అమెరికా జనాభాతో పోల్చుకొని భారత్‌తో కేసుల సంఖ్యను అంచనా వేస్తే భారత్‌లో అమెరికాకు మించిన కేసులు నమోదుకు ఎక్కవ సమయం లేదంటూ వైరస్‌ బాంబు పేల్చారు సైంటిస్టులు. రానున్న ఫిబ్రవరి మొదటివారానికి కరోనా కేసులు ఊహించని పీక్స్‌కు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు.

Read More : Sonu Sood: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా తప్పుకున్న సోనూసూద్

శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యేలానే భారత్‌లో రోజువారీ కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఒక్కరోజే దేశంలో లక్షా 41 వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి. 24గంటల్లో 21శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. సెకండ్‌ వేవ్‌ కన్నా 7 రెట్లు.. ఫస్ట్‌ వేవ్‌ కన్నా 11 రెట్ల వేగంతో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. అటు రోమ్‌ నుంచి 285 మందితో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న విమానంలో 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందర్నీ ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలించారు. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లో కరోనా విలయం కొనసాగుతోంది.