Nara Lokesh : ఏపీలో ఏదోరోజు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ వైజాగ్‌ వెళితే మరింత వణికిపోతారని అన్నారు. జగన్‌ విశాఖ వెళితే తమకే లాభమని.. ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు...

TDP MLC Nara Lokesh : ఏపీలోనూ శ్రీలంకలాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయన్నారు టీడీపీ నేత లోకేశ్‌. త్వరలోనే ఏపీలోనూ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు గుప్పించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి అరాచకాలతో భయపడిపోతున్న విశాఖవాసులు.. జగన్‌ వైజాగ్‌ వెళితే మరింత వణికిపోతారని అన్నారు. జగన్‌ విశాఖ వెళితే తమకే లాభమని.. ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఇక ఎప్పటికీ తమది అభివృద్ధి వికేంద్రీకరణ నినాదమే అన్నారు. 2022, మార్చి 25వ తేదీ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Read More : AP Assembly : పెగాసస్‌‌పై హౌస్ కమిటీ.. ఛైర్మన్, సభ్యులు వీరే

పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే అన్నారు లోకేశ్‌. పరిపాలనా ఒకే చోట ఉంచి.. అన్ని జిల్లాల్లో అభివృద్జి చేయాలనేదే తమ లక్ష్యం అన్నారు. అమరావతే రాజధాని అని నిర్ణయం జరిగిన రోజు.. విశాఖలోనో.. విజయవాడలోనో రాజధాని పెడదామని ఎందుకు చెప్పలేకపోయారంటూ ప్రశ్నించారు. ఆ రోజు అమరావతికి మద్దతు పలికి.. ఇవాళ కాదనడం మోసం కాదా అని నిలదీశారు. అన్ని ఒక చోట ఉన్నప్పుడే పనులు కానప్పుడు.. మూడు వ్యవస్థలు మూడు చోట్ల ఉంటే పనులెలా అవుతాయని సందేహం వ్యక్తం చేశారు. రాజధానుల వల్లే అభివృద్ధి జరుగుతుందంటే.. 175 నియోజకవర్గాల్లో 175 రాజధానులు పెట్టొచ్చుగా అని ప్రశ్నించారు.

Read More : Nara Lokesh : ఇక ప్రజాక్షేత్రంలోకి టీడీపీ నేతలు.. ముహుర్తం ఫిక్స్

రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు.. రాజధానులు నిర్మిస్తారా అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ నేత నారా లోకేశ్‌. నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలనే ప్రారంభించలేని వారు.. కొత్త రాజధానులను ఎక్కడి నుంచి నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. ప్రిజనరీగా జగన్‌ వ్యవస్థల్ని నాశనం చేస్తుంటే.. విజనరీగా చంద్రబాబు భావితరాల బాగు కోరుకున్నారని తెలిపారు. మరోవైపు… మద్యంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ అంశంపై శాసనసభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఇకపై ప్రజల్లోకి వెళ్లాలని ప్రతిపాదించింది. మద్య నిషేధం హామీని ఉల్లంఘించి వైసీపీ ప్రభుత్వ వైఖరిని జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టాలని నిర్ణయించింది. టీడీపీ సభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్‌ చేసిన తర్వాత అధికార పక్షం మద్యంపై చర్చ జరడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ మద్యం విధానంపై ప్రజల్లోనే తేల్చుకుంటామన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్పలు.

ట్రెండింగ్ వార్తలు