AP Assembly : పెగాసస్‌‌పై హౌస్ కమిటీ.. ఛైర్మన్, సభ్యులు వీరే

ఈ క్రమంలో పెగాసస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ కమిటీ ఛైర్మన్ గా...

AP Assembly :  పెగాసస్‌‌పై హౌస్ కమిటీ.. ఛైర్మన్, సభ్యులు వీరే

ap assembly

House Committee On Pegasus : ఏపీ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ పై హౌస్ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని వెల్లడించారు. కమిటీలో ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా కొత్త ప‌ల్లి భాగ్య‌ల‌క్ష్మి, గుడివాడ అమ‌ర్నాథ్, మేరుగ నాగార్జున, మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు, కొలుసు పార్థసార‌ధి, అబ్బ‌య్య చౌద‌రి ఉండనున్నారు. పెగాసస్ తేనెతుట్టేను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కదిపారు. ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ కొనుగోలు అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఏపీలో పెగాసస్ అంశం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.

Read More : Nara Lokesh : ఇక ప్రజాక్షేత్రంలోకి టీడీపీ నేతలు.. ముహుర్తం ఫిక్స్

టీడీపీ ప్రభుత్వం హయాంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారంటూ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించారు. దీనితో టీడీపీ, అధికార వైసీపీ నేతల మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఖండించారు. హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని లోకేష్ ప్రకటించారు. ఈ క్రమంలో పెగాసస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

Read More : AP Pegasus : పెగాసస్‌‌పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

2022, మార్చి 25వ తేదీ శుక్రవారం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమయంలో హౌస్ కమిటీ ఛైర్మన్, సభ్యుల పేర్లను ఆయన వెల్లడించారు. అంతేగాకుండా.. ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఆయన మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. 2019 మే ముందు వరకు ఏ ప్రభుత్వం కూడా పెగాసస్ ను వాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కానీ, డీజీపీ కార్యాలయం కానీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ, మరే ఇతర ప్రభుత్వ విభాగం కానీ, ఏ ప్రైవేటు కార్యాలయం కానీ పెగాసస్ ను కొనడం కానీ, వాడడం కానీ చేయలేదని తేల్చి చెప్పారు. ఫోన్ల హ్యాకింగ్, ట్యాపింగ్ కాలేదని వెల్లడించారు.