Nara Lokesh : ఇక ప్రజాక్షేత్రంలోకి టీడీపీ నేతలు.. ముహుర్తం ఫిక్స్

అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా...

Nara Lokesh : ఇక ప్రజాక్షేత్రంలోకి టీడీపీ నేతలు.. ముహుర్తం ఫిక్స్

Ap Tdp (1)

AP TDP Leaders : ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి.. ప్రభుత్వ తప్పుడు విధానాలు ఎండగడుతామని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ వెల్లడించారు. 2022, మార్చి 29వ తేదీ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడుతామని ప్రకటించారు. చట్టసభల్లో తమ గొంతు నొక్కినా… ప్రభుత్వ తప్పిదాలను మాత్రం వదిలిపెట్టమని ఖరాఖండిగా చెప్పారు. ఏపీ రాష్ట్రంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శల బాణాలు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం, కల్తీ సారా ఇతరత్రా అంశాలపై ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. సభలో ఆందోళన చేయడంతో వారిని స్పీకర్ సస్పెండ్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.

Read More : TDP Protest : ఏపీ అసెంబ్లీ, మండలిలో తాళిబొట్లతో టీడీపీ సభ్యుల నిరసన

రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థపై దాడికి దిగలేదని, 10వ తరగతి తప్పిన వ్యక్తి ఆలోచనతో న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. ప్రిజనరికి విజనరికి ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని సూచించారు. ప్రిజనరి వ్యవస్థల నాశనం గురించి ఆలోచిస్తే.. విజనరి భావితరాల బాగు కోరుకుంటాడన్నారు. జగన్ ప్రిజనరి అయితే చంద్రబాబు విజనరి అని అభివర్ణించారు. 40 గంటల పాటు సాగిన ఏపీ అసెంబ్లీలో సారా మరణాలపై 40 నిమిషాలు పాటు చర్చించలేరా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ నారా లోకేష్.