MP Kanakamedala: నేతల మెప్పుపొందేందుకే రాజధానిపై అధికారులు హైకోర్ట్ లో అఫిడవిట్: ఎంపీ కనకమేడల

అమరావతి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రవీంద్ర కుమార్ మండిపడ్డారు.

MP Kanakamedala: నేతల మెప్పుపొందేందుకే రాజధానిపై అధికారులు హైకోర్ట్ లో అఫిడవిట్: ఎంపీ కనకమేడల

Kanaka

Updated On : April 4, 2022 / 12:17 PM IST

MP Kanakamedala: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల అభివృద్ధికి మరో ఐదేళ్ల సమయం పడుతుందంటూ ఇటీవల ప్రభుత్వ అధికారులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి భూములను ఆరు నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ అధికారులు ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై సోమవారం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ స్పందిస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆవాస్తవ విషయాలు ప్రస్తావించారని..అఫిడవిట్ లో అన్నీ కూడా కాకమ్మ కథలు చెప్పారంటూ రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు.

Also read:MP Rammohan Naidu: ఏపీలో విద్యుత్ కోత..కరెంటు బిల్లుల మోత: జగన్ పాలనలో ప్రజల్లో విశ్వాసం లేదన్న రామ్మోహన్

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం గతంలో పెట్టిన పది వేల కోట్ల ఖర్చు, ఆస్తుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఎంపీ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో చేపట్టిన అన్ని పనులను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ఎంపీ రవీంద్ర కుమార్ అన్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును అమలు చేయడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా? అని ఎంపీ రవీంద్ర కుమార్ ప్రశ్నించారు.

Also read:Ap cm jagan : రేపు ఢిల్లీకి సీఎం జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ ..

అధికారంలో ఉన్న రాజకీయ నేతలను, బాస్ లను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వ అధికారులు వేసిన తప్పుడు అఫిడవిట్..కోర్టు ధిక్కరణ అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ బాస్ లఅడుగులకు మడుగులొత్తినంత కాలం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు పరిణామాలే కొనసాగుతాయని టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లాలి కానీ, కోర్టులను తప్పుదోవ పట్టించరాదంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Also read:Roja: రాజకీయాల్లో నిజమైన టార్చ్ బేరర్ జగన్: రోజా