TDP Vs YSRCP : టీడీపీ – వైసీపీ పొలిటికల్ వార్, గవర్నర్‌‌ను కలువనున్న టీడీపీ నేతలు

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్‌ వార్‌ మొదలైంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య గొడవకు ఆజ్యం పోశాయి.

Chandrababu Naidu House : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్‌ వార్‌ మొదలైంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య గొడవకు ఆజ్యం పోశాయి. అయ్యన్న వ్యాఖ్యలు నిరసిస్తూ వైసీపీ నేత జోగి రమేశ్‌ చంద్రబాబు ఇంటి ఎదుట చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడం ఏపీలో రాజకీయ సెగలు రాజేస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని టీడీపీ, నిరసన చెప్పేందుకు వచ్చిన తమపై దాడి చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ గొడవ అంతటితో ఆగలేదు. కంటిన్యూ అవుతూనే ఉంది.

Read More : Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణమిదేనంటోన్న మాజీ సెలక్టర్

చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ కార్యకర్తలు సృష్టించిన గొడవను టీడీపీ సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలబోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.. 2021, సెప్టెంబర్ 18వ తేదీ శనివారం గవర్నర్‌ను కలిసే అవకాశముంది. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి కంప్లైంట్ చేసే అవకాశముంది.గవర్నర్‌కే కాదు… అవసరమైతే ప్రధాని మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సైతం ఫిర్యాదు చేస్తామంటున్నారు టీడీపీ నేతలు.

Read More : GST – Nirmala Sitharaman ‘జీఎస్టీ పరిధిలో వాటిని చేర్చడం సరైన సమయం కాదు’

చంద్రబాబు ఇంటిపై దాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు ఇంటిపైనే దాడికి యత్నించారని.. త్వరలోనే మోదీని, అమిత్‌షాను కలిసి కంప్లైంట్‌ చేస్తామంటున్నారు టీడీపీ నేతలు.ఇక ఇప్పటికే చంద్రబాబు ఇంటి ఎదుట జరిగిన ఘర్షణపై ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఇటు టీడీపీ, వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేశారంటే తమపై చేశారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు