Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణమిదేనంటోన్న మాజీ సెలక్టర్

ఈ కారణంతోనే టీ20 వరల్డ్‌కప్ ముంగిట.. బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు’ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.

Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణమిదేనంటోన్న మాజీ సెలక్టర్

Virat Kohli

Virat Kohli: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. యూఏఈలోని ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు కోహ్లీ. ఈ అనూహ్య నిర్ణయం వెనుక కారణమేమై ఉండొచ్చు.

జట్టులో విబేధాలా.. మేనేజ్మెంట్ తో సమస్యలా.. ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటా అని తెగ ఆలోచించేస్తున్నారు క్రికెట్ అభిమానులు. వీటన్నిటిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

‘టీ20 వరల్డ్‌కప్ ముంగిట విరాట్ కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. బహుశా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం ఎక్కువగా ప్రభావం చూపించి ఉండొచ్చు. పదేళ్ల కాలంలో కోహ్లీ 70 సెంచరీలు (43 వన్డేలు, 27 టెస్టులు) నమోదు చేసి అత్యుత్తమ బ్యాటింగ్ స్టాండర్డ్స్ నెలకొల్పాడు. ఏడాదిన్నర కాలంగా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం అతని పర్‌ఫార్మెన్స్‌పై ప్రభావం చూపింది. ఈ కారణంతోనే టీ20 వరల్డ్‌కప్ ముంగిట.. బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు’ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.