Telugu Students : చంద్రబాబుతో భేటీ అయిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు

యుద్ధ సమయంలో తాము పడిన అందోళన, కష్టాలను చంద్రబాబుకు వివరించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ స్పందిస్తుందని చంద్రబాబు అన్నారు.

Chandrababu (1)

Telugu students Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుతో యుక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు భేటీ అయ్యారు. ఇండియా వచ్చేందుకు సహకరించిన చంద్రబాబుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. యుక్రెయిన్ నుంచి ఇండియాకు రావడానికి సహకరించిన ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి, అండగా నిలిచిన చంద్రబాబుకు విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు.

Telugu Students Ukraine : యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు.. ఒక్కరోజే 244మంది రాక

యుద్ధ సమయంలో తాము పడిన అందోళన, కష్టాలను చంద్రబాబుకు వివరించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ స్పందిస్తుందని చంద్రబాబు అన్నారు. అధికారంలో లేకపోయినా… విద్యార్ధులకు ఎంతో కొంత సాయం చెయ్యగలిగామని చెప్పారు. తిరిగొచ్చిన విద్యార్థులకు ఇండియాలో అడ్మిషన్లు ఇవ్వడంపై కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు.