Telugu Students Ukraine : యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు.. ఒక్కరోజే 244మంది రాక

యుక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు(Telugu Students Ukraine) సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ ఒక్కరోజులో 244 మంది..

Telugu Students Ukraine : యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు.. ఒక్కరోజే 244మంది రాక

Telugu Students

Telugu Students Ukraine : యుక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ ఒక్కరోజులో 244 మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక విమానాల్లో యుక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వారిలో ఏపీకి చెందిన విద్యార్థులు 109 మంది ఉన్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు 135 మంది ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులకు ఏపీ, తెలంగాణ భవన్ లో వసతి, భోజన ఏర్పాట్లు చేశారు అధికారులు. అనంతరం రైళ్లు, బస్సుల్లో విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య భీకర యద్ధం జరుగుతోంది. రష్యా సేనలు యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ పౌరులు, అక్కడ ఉంటున్న విదేశీయులు ప్రాణభయంతో బతుకుతున్నారు. విదేశీయుల్లో భారతీయులు కూడా ఉన్నారు. వారిలో తెలుగు విద్యార్థులు(Telugu Students Ukraine) ఉన్నారు. యుక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది.

Indian Students Ukraine : ‘మాకు ఏమైనా భారత ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీదే బాధ్యత.. ఇదే మా చివరి వీడియో’

ఉక్రెయిన్‌లోని పొరుగు దేశాల నుంచి ఆప‌రేష‌న్ గంగాలో భాగంగా న‌డుపుతున్న ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు తరలిస్తోంది భారత ప్రభుత్వం. యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు చేరుకుంటున్నారు. 3 ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థులు క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మిగిలిన విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు.

Operation Ganga : యుక్రెయిన్ నుంచి మనోళ్లు మరింత మంది వచ్చేశారు

రష్యా, యుక్రెయిన్ భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను స్వదేశానికి తీసుకొస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి వేలసంఖ్యలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన వారిని కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

యుక్రెయిన్ లోని సుమి.. కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. సుమిలో నరకం చూస్తున్న భారతీయ విద్యార్థులు ప్రాణాలకు తెగించి సరిహద్దులకు బయలుదేరుతున్నారు. రెండు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ సుమిలో మాత్రం లేదు. అయితే ఇక అక్కడ ఉండలేకపోతున్న భారతీయ విద్యార్థులు మన జెండాలతో సరిహద్దులకు బయలుదేరుతున్నారు. భారతీయ జెండాలతో ఉంటే రష్యన్లు కాల్పులు జరపరన్న నమ్మకంతో వాటితో బయలుదేరుతున్నారు. సుమిలో వేయిమందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడ నరకం చూస్తున్నారు. ఇంకొన్నాళ్లు అక్కడే ఉంటే తిండికి కూడా లేక చనిపోతామంటున్నారు.

యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా మళ్లీ ఫోకస్ పెంచింది. కీవ్‌తో పాటు రాజధాని సమీప ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా దాడులు చేస్తోంది. కీవ్ మిలటరీ ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించింది రష్యా. అటు యుక్రెయిన్‍‌ నగరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. రోజుకు సగటున 25కు పైగా మిస్సైల్ దాడులతో యుక్రెయిన్‌ మొత్తాన్ని షేక్ చేస్తోంది. యుక్రెయిన్‌లో ఇప్పటివరకు 500లకు పైగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది రష్యా.

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 26న భార‌త పౌరుల తరలింపు ప్రారంభమైంది. యుక్రెయిన్ పొరుగు దేశాల నుంచి భారత పౌరులు, విద్యార్థులు విమానాల ద్వారా వచ్చారు. బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరీ), ర్జెస్జో (పోలాండ్), కోసీస్ (స్లోవేకియా), సుసెవా (రొమేనియా) నుండి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది.