×
Ad

Cold Intensity : తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత, చలికి గజగజ వణుకుతున్న విశాఖ మన్యం

చలికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.

  • Published On : December 22, 2023 / 12:03 PM IST

cold waves

Increased Cold Intensity : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఏపీలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి పొడి గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా ఒడిశా మీదుగా వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. ఈ సీజన్‌లో తొలిసారి కళింగపట్నంలో 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో మిగిలిన ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది.

చలికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏటా డిసెంబరు, జనవరిలో గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యలో నమోదవుతుంటాయి. అయితే ఈ ఏడాది అకాల వర్షాలు, తుఫాన్లు కారణంగా ఇప్పటివరకు 10 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.

Covid-19 In India : దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను మహమ్మారి కలవరం

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు ఉంటోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.