Covid-19 In India : దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను మహమ్మారి కలవరం

దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాపకింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది.

Covid-19 In India : దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను మహమ్మారి కలవరం

covid 19 In India : దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాపకింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది. దీంట్లో భాగంగా దేశంలో ప్రస్తుతం 2997 కేసులు నమోదు కాగా..గడిచిన 24 గంటల్లోనే 328 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సోకి ఒకరు మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేరళలో కొత్తగా 265 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ వ్యాప్తంగా కోవిడ్ కేసులు 2606కు చేరుకున్నాయి. కేరళలోనే ఒకరు కోవిడ్ తో మృతి చెందారు. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి,మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులు
ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ మహమ్మారి మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీలో మూడు కేసులు నమోదు కాగా..తెలంగాణలో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడు 15,కర్ణాటకలో 13 నమోదయ్యాయి. తెలంగాణలో 19 యక్టీవ్ కేసులుండగా..ఏపీలో 4 యక్టీవ్ కేసులున్నాయి. జెఎన్.1 కొత్త వేరియంట్ నేపధ్యంలో రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.