AP new districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే..

ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్‌ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..?

Temporary break for the formation of new districts : ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్‌ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..? ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు.. 2021 జనాభా లెక్కలు ఇంకా పూర్తి కాకపోవడం అడ్డంకిగా మారింది.

ఆర్టీఐ దరఖాస్తుతో ఈ వివరాలు బయటికొచ్చాయి. జనాభా లెక్కలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దరఖాస్తుకు సమాధానం రావడంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా జనగణన పూర్తయ్యే వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు పంపింది.

ఏపీలోని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలుకు పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేశారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది సర్కార్‌. ఆ కమిటీ ప్రతిపాదిత నివేదికను కూడా రూపొందించింది. పార్లమెంట్ నియోజవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మొత్తం 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదించింది.

అయితే.. లోకల్‌ బాడీ ఎన్నికలతో జిల్లాల ఏర్పాటుకు ఆటంకం ఏర్పడింది. 2021 జనాభా లెక్కలు ఇప్పుడు మరోసారి అడ్డంకిగా మారబోతున్నాయి. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ నిలిచిపోయింది. దేశంలో ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలను సేకరిస్తారు. ఏపీలో ఇటీవల వెల్లడైన పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఫలితాలు వైసీపీకి పూర్తి అనుకూలంగా రావడం.. ఇక రేపోమాపో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో.. కేంద్రం ఇచ్చిన ట్విస్ట్ ఆర్‌టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చింది.

జనాభా లెక్కలు తేలే వరకూ సరిహద్దులు మారకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు… జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో మార్పులు, చేర్పులు చేయొద్దని సూచించింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేయడం ఇప్పట్లో సాధ్యం కాని పని. కరోనా కేసులు తగ్గి జనగణన మొదలైనా.. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టే అవకాశముంది. అప్పటివరకూ | లేనట్టేనని తేలిపోయింది.

ట్రెండింగ్ వార్తలు