High Court : క్షమాపణలు కోరిన ఐఏఎస్ లకు జైలుశిక్ష తప్పించిన హైకోర్టు.. ‘ప్రతినెలా సంక్షేమ హాస్టళ్లో ఓ రోజు సేవ చేయండి’

ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లకు హైకోర్టు సూచించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది.

Ap High Court

AP High Court : కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. రెండు వారాలపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఐఏఎస్ లు హైకోర్టును క్షమాపణలు కోరారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు సూచించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ఏడాదిపాటు ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లకు హైకోర్టు సూచించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వైఖరిని కోర్టు ధిక్కరణగా హైకోర్టు భావించింది.

AP HC Series on Twitter : ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు ఫైర్‌..వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్

ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం ఎం నాయక్ ల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించింది.