AP HC Series on Twitter : ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు ఫైర్‌..వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్

ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆదేశాలు పాటించకపోతే..వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

AP HC Series on Twitter : ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు ఫైర్‌..వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్

Ap High Court Series On Twitter

AP High Court Series on Twitter : సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై..ముఖ్యంగా న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల విషయంలో ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై ట్విట్టర్ లో అనుచిత పోస్టుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ హైకోర్టు సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారత్ లోని చట్టాలను.. న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంద‌ంటూ తీవ్ర హెచ్చ‌రికలు చేసింది.

న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచార‌ణలో ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ధర్మాసనం అభిప్రాయప‌డింది. ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే అటువంటి ఆ పోస్టులు వస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తు సీరియ‌స్ అయ్యింది. ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియ‌ల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులిస్తామ‌ని హెచ్చ‌రించింది. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టినవారిని వారు విదేశాల్లో ఉన్నా సరే..వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారు? అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది.దీనికి సంబంధించి అన్ని వివరాలతో వచ్చే వారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.