Murder
youngster brutal murder : తిరుపతిలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. స్నేహితులే అతన్ని హతమార్చారు. గత రాత్రి ఓ హోటల్ వద్ద ప్రసన్న కుమార్ అనే యువకుడిని అతని స్నేహితులు బీరు బాటిళ్లతో పొడిచి చంపేశారు. పుట్టిన రోజు నాడే ప్రసన్న కుమార్ ను హతమర్చారు.
మృతుడు ప్రసన్న కుమార్ కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లకు సన్నిహితుడు. ప్రసన్నకుమార్.. నిన్న ఒక్కరోజే పలుచోట్ల బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. నిన్న తిరుపతిలోని ఓ హోటల్ గదిలో స్నేహితులకు ప్రసన్న కుమార్ బర్త్ డే పార్టీ ఇచ్చాడు. పుట్టిన రోజు పార్టీలో ఎనిమిది మంది స్నేహితులు పాల్గొన్నారు.
Corona : దేశంలో కరోనా థర్డ్‌వేవ్
మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. హోటల్ ముందే ప్రసన్న కుమార్(29) అనే యువకుణ్ణి మద్యం సీసాలతో సహచర యువకులు పొడిచి చంపారు. ఎల్లంరెడ్డి, పవన్ కుమార్, బాలాజీలు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.