Corona : దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌

గత ఏడాది డిసెంబర్‌ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్‌ కేసును గుర్తించగా, డిసెంబర్‌ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్‌వేనని ఆరోరా వివరించారు.

Corona : దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌

Covid

corona third wave : దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 2వేలకు చేరువైంది. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కేరళలో ఉన్నాయి.

ఇటు కరోనా కేసులు కూడా అన్ని రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్‌ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌ వేరియంట్‌వే అని చెప్పారు.

Corona: ఫ్రాన్స్ లో బయటపడ్డ మరో కొత్త వేరియంట్

గత ఏడాది డిసెంబర్‌ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్‌ కేసును గుర్తించగా, డిసెంబర్‌ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్‌వేనని ఆరోరా వివరించారు. తదుపరి వారంలో ఇది 28 శాతానికి పెరిగిందన్నారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైనట్లేనని స్పష్టం చేశారు.

గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య దీనికి నిదర్శమన్నారు. మరోవైపు టీనేజర్ల టీకాపై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. టీకాలు పూర్తిగా సురక్షితమన్నారాయన. అలాగే బూస్టర్‌ డోసు ఇంపార్టెన్స్‌పై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.