Corona: ఫ్రాన్స్ లో బయటపడ్డ మరో కొత్త వేరియంట్

కరోనాలో మరో కొత్త వేరియంట్ ను తాజాగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఈరకమైన వేరియంట్ కి 46 ఉత్పరివర్తనలు ఉన్నాట్లు సైంటిస్టులు గుర్తించారు.

Corona: ఫ్రాన్స్ లో బయటపడ్డ మరో కొత్త వేరియంట్

Coronafrance

Corona: కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. రోజుకో కొత్త రూపంలో ప్రజలపై తన ప్రతాపం చూపిస్తుంది కరోనా మహమ్మారి. కరోనాలో మరో కొత్త వేరియంట్ ను తాజాగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఈరకమైన వేరియంట్ కి 46 ఉత్పరివర్తనలు ఉన్నాట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇవి అసలు వైరస్ కంటే ఎక్కువ వ్యాప్తిని కలిగి.. టీకా-నిరోధకతను అధిగమిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ కొత్త కరోనా వేరియంట్ కు IHU వేరియంట్(B.1.640.2)గా నామకరణం చేసారు. ఈ IHU B.1.640.2 వేరియంట్ కేసులు ఇప్పటి వరకు ఫ్రాన్స్ లో 12 కేసులను గుర్తించారు. దీని మూలాలు ఆఫ్రికా దేశం కెమరూన్ లో ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. డిసెంబర్ 10న జరిపిన పరిశోధనల్లో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి కంటే చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Read: Nani : ఆ థియేటర్లో ‘టక్కరి దొంగ’ సినిమాకి రచ్చ రచ్చ చేశాం.. ఇప్పుడు ఇలా జరగడం బాధాకరం

కొత్త కరోనా వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన WHO, మరేఇతర దేశాల్లోనైనా ఇటువంటి వేరియంట్ ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. E484K అనే ఉత్పరివర్తనాన్ని కలిగిఉన్న ఈ కొత్త వేరియంట్ పై వాక్సిన్ కూడా ప్రభావం చూపడంలేదు. ఇందులోనే ఉన్న N501Y అనే ఉత్పరివర్తనం కారణంగా ఈ వేరియంట్ అధిక వ్యాప్తికి దోహదం చేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఓమిక్రాన్ మూలాల నుంచే వచ్చిన ఈ IHU B.1.640.2 వేరియంట్, ఓమిక్రాన్ కంటే ముందు నుంచే ఉండిఉండొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా కల్లోలంతో కుదేలైన ఫ్రాన్స్ లో వైరస్ వ్యాప్తిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయి.

Read: Bandi Sanjay : బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ..!