Kadapa : ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కేదార్ మహంకాళికి రాహు కేతు పూజ చేయించడానికి సిద్ధాంతి చంద్రగుప్తతో కాళహస్తికి బయలుదేరారు.

Car

car crashed into a pond : కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరు కారుతోపాటు గల్లంతయ్యారు. కారులో గల్లంతై మృతి చెందిన వారు చంద్రగుప్త, మహంకాళిగా గుర్తించారు పోలీసులు. కారులో కాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే కారు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నుంచి బయటపడే ప్రయత్నంలో ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయినట్లుగా తెలుస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కేదార్ మహంకాళికి రాహు కేతు పూజ చేయించడానికి సిద్ధాంతి చంద్రగుప్తతో కాళహస్తికి బయలుదేరారు. మార్గమధ్యలో కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరాముని దర్శించుకున్నారు. అనంతరం కాళహస్తికి ప్రయాణమయ్యారు. ఒంటిమిట్ట నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే కారు ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు బయటికి రావడానికి ప్రయత్నించారు.

Nagar Kurnool : స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా విషాదం.. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

అందులో డ్రైవర్‌తో పాటు కేదార్ మహంకాళి తమ్ముడు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు జలసమాధి అయ్యారు. పూజ చేయించుకోవడానికి వెళ్తున్న కేదార్ మహంకాళితో పాటు ఆయనతో పూజ చేయించడానికి వెళ్తున్న సిద్ధాంతి కూడా మృతి చెందాడు. క్రేన్ సహాయంతో చెరువులోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.