Tirumala Express Smoke : తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 30,2022) తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి.

Tirumala Express train

Tirumala Express Smoke : తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 30,2022) తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.

సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పొగలు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకున్నారు. రైల్వే సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.

Also Read :  Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

ప్రమాదానికి గల కారణాలు ఏంటని అధికారులు ఆరా తీశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైళ్ల రాకపోకలను యథావిధిగా కొనసాగించారు. ప్రాణం నష్టం జరగకపోవంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.