Chandrababu
Thiruvuru TDP: తిరువూరు తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్‌లో క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుందోనని టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి పంచాయితీని పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగించిన చంద్రబాబు పిలిచి మాట్లాడాలని చెప్పారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చాక తాను కూడా ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడుతానన్నారు చంద్రబాబు.
ఈ నేపథ్యంలో ఈ నెల 4న పార్టీ ఆఫీస్‌కు రావాల్సిందిగా..ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడికి క్రమశిక్షణా కమిటీ నుంచి పిలుపు అందింది. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. వాటి బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇవే అంటూ తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఎంపీ చిన్ని కూడా దీటుగానే రియాక్ట్ అయ్యారు. అయితే ఈ ఎపిసోడ్‌తో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఇద్దరినీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. (Thiruvuru TDP)
అయితే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొలికపూడి వివాదంపై పార్టీ సీనియర్లతో చర్చించిన అధినేత..కొలికపూడిని పార్టీ నుంచి పంపించేయాలన్న నిర్ణయానికి వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కంటే వ్యక్తిగత పరపతి వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని కొద్దిమంది భావిస్తున్నారని, అలాంటివారితోనే సమస్యలు వస్తున్నాయని సీఎం ఫైర్ మీదున్నట్లు తెలుస్తోంది.
Also Read: K Kavitha: కవితక్క పోల్ స్ట్రాటజీ.. సింహం గుర్తుపై ఫోకస్..!
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న కొలికపూడి వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలుసార్లు ఆయనకు వార్నింగ్ ఇవ్వడంతో..కొలికపూడి పార్టీని వీడి వెళ్తారని టీడీపీలోనే ఇన్‌సైడ్ టాక్ నడిచింది. కానీ కొత్త సమస్యలు సృష్టిస్తూ కొలికపూడి కేరాఫ్ కాంట్రవర్సీగా నిలుస్తూ.. పార్టీని ట్రబుల్స్‌లో పడేస్తుండటంతో ఈ సారి స్ట్రిక్ట్ యాక్షనే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ఆ రచ్చ జరిగినప్పుడు చంద్రబాబు విదేశాల్లో.. ఇప్పుడు కూడా..
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి రచ్చ జరిగినప్పుడూ చంద్రబాబు దుబాయ్‌లో ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే..ఇద్దరు నేతలతో క్రమశిక్షణా కమిటీ భేటీ కానుంది. అయితే బాబు యూకే టూర్‌లో ఉండగానే కొలికపూడి విషయంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలు మాత్రం అధినేత విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక కొలికపూడిపై చర్యలు ఉంటాయని అంటున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీని పిలిపించి మాట్లాడతానని చెప్పినప్పటికీ, ఎంపీ విషయంలో అధినేత కొంత సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కామెంట్స్‌పై ఎంపీ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంపైనే సీఎంకు కొంత అభ్యంతరం ఉందట. పరిస్థితి ఇంతవరకు రాకుండా చూసుకోవాల్సింది పోయి..ఎంపీ కూడా ప్రెస్‌మీట్ పెట్టి రియాక్ట్ అవడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి తరహాలోనే మరికొందరు నేతల తీరు ఉండటంతో పాటు..కొందరు సొంత ఎజెండాతో వెళ్తున్నారని సీఎం దృష్టికి వెళ్లిందంటున్నారు.
పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తించుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీ పెద్దలకు హెడెక్‌గా మారాయి. టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారంపై అధినాయకత్వం సీరియస్‌గా ఉంది. అందుకే ఇక మీదట ఎవరైనా గీతదాటితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో క్రమశిక్షణా కమిటీ ఇచ్చే నివేదిక..సీఎం చంద్రబాబు తీసుకునే చర్యలపైనే ఉత్కంఠ కొనసాగుతోంది.