ఏపీలో మూడు రాజధానులు : సౌతాఫ్రికా మోడల్ ఏంటీ

  • Publish Date - December 18, 2019 / 12:59 AM IST

ఏపీలో రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ చెప్పిన సౌతాఫ్రికా మోడల్ ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికా దేశానికి మూడు రాజధానులున్నాయి. ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లోమ్‌ఫాంటేన్. ఈ మూడు నగరాలు సౌతాఫ్రికా రాజధానులు.

అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా ఉన్న ప్రిటోరియాలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు ఉన్నాయి. లెజిస్లేచివ్ క్యాపిటల్‌గా ఉన్న కేప్‌టౌన్‌లో చట్టసభలు మాత్రమే ఉన్నాయి. ఇక జ్యుడిషియల్ క్యాపిటల్‌గా బ్లోమ్‌ఫాంటేన్‌లో ఆ దేశ సుప్రీంకోర్టు ఉంటుంది. సౌతాఫ్రికా దేశం కనుక అక్కడ సుప్రీంకోర్టు.. ఏపీ రాష్ట్రం కనుక ఇక్కడ హైకోర్టు అంతే, మిగతావన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే సీఎం జగన్ ఓ క్లారిటీతో ఉన్నట్లు అసెంబ్లీలో ఆయన ప్రకటనను బట్టి అర్థమవుతోంది. 

ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ సంచలన ప్రకటన
రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చన్న సీఎం
అమరావతిలో చట్టసభలు ఉంటాయి
విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటుంది
హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవచ్చు
 

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు
ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ విశాఖలో ఉన్నాయి
విశాఖలో ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుందన్న జగన్‌
ఆ దిశగా ప్రతిపాదనల కోసం ఓ కమిటీని నియమించాం
మరో వారంలో ఆ కమిటీ నివేదిక వస్తుంది: సీఎం జగన్

సౌతాఫ్రికా మాదిరిగా మూడు రాజధానుల అంశంపై సీరియస్‌గా చర్చించాల్సిన అవసరముందన్నారు జగన్. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి… ఎలా ఖర్చు చేస్తున్నామనే దానిపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు చేయడం కోసమే నిపుణులతో ఒక కమిటీని వేశామన్న జగన్‌… మరో వారంలో ఆ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

అమరావతిలో చట్టసభలు ఉంటాయన్నారు జగన్. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటుందున్నారు. అంటే.. అక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవచ్చని జగన్ సూచనప్రాయంగా చెప్పారు. జ్యుడిషియల్‌ కేపిటల్‌ ఒకవైపున… ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ మరోవైపున… లెజిస్లేటివ్‌ కేపిటల్‌ అమరావతిలో పెట్టొచ్చన్నారు.
Read More : ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు : సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన