Tirumala : తిరుమలలో కలకలం, కొండపై హెలికాప్టర్లు చక్కర్లు.. అసలేం జరిగింది?

Tirumala : ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల నో ఫ్లై జోన్. అంటే తిరుమల కొండపై విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ప్రయాణించడం నిషేధం. డ్రోన్లు ఎగరేయడం కూడా నిషేధమే.

Tirumala

Tirumala : తిరుమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ అయిన తిరుమల కొండ మీద నుంచి ఏకంగా 3 హెలికాప్టర్లు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందినవిగా గుర్తించారు. శ్రీవారి ఆలయం గగనతలంలో ఈ హెలికాప్టర్లు వెళ్లడం కలకలం రేపింది. ఈ హెలికాప్టర్లు కడప నుంచి చెన్నైకి తిరుమల మీదుగా వెళ్లినట్లు సమాచారం. నో ఫ్లై జోన్ లో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం దుమారానికి దారితీసింది.

ఆగమశాస్త్రం ప్రకారం.. తిరుమల నో ఫ్లయ్ జోన్..
తిరుమల.. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన ఆధ్యాత్మిక క్షేత్రం. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. వెంకన్నను క్షణకాలం దర్శించుకుని పులకించిపోతారు. ఇక, ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల నో ఫ్లై జోన్. అంటే తిరుమల కొండపై విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ప్రయాణించడం నిషేధం. డ్రోన్లు ఎగరేయడం కూడా నిషేధమే. అలాంటిది ఏకంగా మూడు హెలికాప్టర్లు తిరుమల కొండపై శ్రీవారి ఆలయం మీదుగా గగనతలంలో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది.(Tirumala)

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

నిబంధన గురించి తమకు సమాచారం లేదంటున్న ఎయిర్ ఫోర్స్ అధికారులు..
ఆ మూడు హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందినవిగా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. కాగా, ఇది కావాలని చేసిన పని కాదని.. తిరుమల నో ఫ్లయ్ జోన్ అనే సమాచారం వారికి లేకపోవడం వల్లనే హెలికాప్టర్లు ఆ దారి వెంబడి ప్రయాణించాయని అధికారులు చెబుతున్నారు.

తిరుమలను నో ఫ్లయ్ జోన్ గా ఎప్పుడో ప్రకటించారని, ఆలయం మీదుగా హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ప్రయాణం చేయకూడదనే నియమం ఎప్పటి నుంచో ఉందని, అయినా ఇప్పుడిలా హెలికాప్టర్లు ప్రయాణం చేయడం ఏంటని భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు మండిపడుతున్నారు. ఈ నియమం గురించి ఎయిర్ ఫోర్స్ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఏది ఏమైనా తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం వివాదాస్పదమైంది.(Tirumala)

Also Read..Ramesh Naidu: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..

అపచారం జరిగిపోయింది, దోష పరిహారం చేయాల్సిందే..
అయితే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. దీన్ని అపచారంగా భావించాల్సిందే అంటున్నారు. కచ్చితంగా అది దోషమే అని, దోష పరిహారం చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. తిరుమలలోని పెద్ద స్వాములను సంప్రదించి వారి సలహాలు తీసుకుని శాంతి పూజలు చేయాల్సిందే అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నిఘా తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏం జరుగుతోంది అనేది పరిశీలన చేస్తూ ఉండాల్సిందేనని ఆధ్యాత్మికవేత్తలు స్పష్టం చేశారు. నో ఫ్లయ్ జోన్ అనే రూల్ ఏదైతే ఉందో దాన్ని కచ్చితంగా అందరూ పాటించే విధంగా టీటీడీ అధికారులే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

తిరుమల శేషాచల కొండల మీద విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ప్రయాణించడం నిషేధం. దానికి విరుద్ధంగా ఇవాళ మూడు హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలో గగనతలంలో వెళ్లడం జరిగింది. ఈ వ్యవహారం తిరుమలలో కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ విభాగం.. హెలికాప్టర్లు ఎవరివి? ఏ ప్రాంతానికి చెందినవి? అని ఆరా తీశారు. అవన్నీ కూడా కడప నుంచి చెన్నైకి వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ కి చెందిన మూడు హెలికాప్టర్లుగా గుర్తించారు.