Andhra Pradesh
Andhra Pradesh Half Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకాగా.. ఏప్రిల్ 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే, తాజాగా విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పదోతరగతి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్న స్కూళ్లలో ఒంటిపూట బడుల సమయాల్లో మార్పులు చేసింది.
Also Read: AP Govt: విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారి అకౌంట్‌లలో డబ్బులు
ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు మధ్యాహ్నం 1.15 గంటలకే స్కూల్స్ ప్రారంభమయ్యేవి. తాజాగా స్కూల్స్ టైమింగ్స్ మార్చారు. టెన్త్ పరీక్షల సెంటర్స్ ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయి.
పదో తరగతి ఎగ్జామ్ సెంటర్ లేని మిగిలిన స్కూళ్లకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు యథాతథంగా తరగతులు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది.