AP Govt: విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారి అకౌంట్‌లలో డబ్బులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ...

AP Government
Reimbursement: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
Also Read: Nara Brahmani : నారా బ్రాహ్మణి కట్టుకున్న చీర మీద వాల్మీకి చరిత్ర..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో రూ.600 కోట్లు విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలోనే మరో రూ.400కోట్లు విడుదల చేయడం జరుగుతుందని శశిధర్ తెలిపారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దని, ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సూచించింది.
Also Read: YSRCP: జగన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లు వైసీపీని ఎందుకు వీడుతున్నట్లు? ఇందుకేనా?
పెండింగ్ లో ఉన్న ఫీజురీయింబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అయితే, ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో.. విద్యార్థులను తరగతులకు హాజరుకాకుండా చేసినా, పరీక్షలకు హాజరు కాకుండా హాల్ టికెట్ల నిలిపివేత లాంటి చర్యలు తీసుకున్నా అట్టి యాజమాన్యాలపై కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు తమ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

AP Government