Nara Brahmani : నారా బ్రాహ్మణి కట్టుకున్న చీర మీద వాల్మీకి చరిత్ర..
బ్రాహ్మణి చీరపై అక్షరాలు కనిపించడంతో అదేమిటి అనే ఆసక్తి నెలకొంది.

Nara Brahmani : సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని స్వామి వారి దర్శనం చేసుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్ ఉన్నారు. శుక్రవారం ఉదయం వీరంతా స్వామి వారిని దర్శించుకున్నారు.
కాగా, తిరుమల శ్రీవారిని చంద్రబాబు కుటుంబం దర్శించుకున్న సమయంలో నారా బ్రాహ్మణి చీర స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం లేకపోలేదు. బ్రాహ్మణి కట్టుకున్న చీరపై వాల్మీకి చరిత్ర ఉంది. డిజైన్ రూపంలో వాల్మీకి చరిత్రను ప్రింట్ చేశారు.
బ్రాహ్మణి చీరపై అక్షరాలు కనిపించడంతో అదేమిటి అనే ఆసక్తి నెలకొంది. అదేమిటో తెలుసుకోవాలని ఇంట్రస్ట్ చూపించారు భక్తులు. తర్వాత అది వాల్మీకి చరిత్ర అని తెలిసింది.
Also Read : ఏపీలో ఆపరేషన్ గరుడ.. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు..
తిమరుల శ్రీవారి దర్శనం తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చింది చంద్రబాబు కుటుంబం. దేవాన్ష్ పుట్టినరోజున ప్రతి ఏటా చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే అన్నదానం చేస్తున్నారు.