Raids In Medical Shops : ఏపీలో ఆపరేషన్ గరుడ.. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు..
దాదాపు 100 బృందాలు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు, దాడులు చేస్తున్నాయి.

Raids In Medical Shops : ఏపీలో మెడికల్ షాపులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు జరుగుతున్నాయి. మెడికల్ షాపులతో పాటు ఏజెన్సీలపైనా దాడులు కొనసాగిస్తున్నారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, లోకల్ పోలీసులతో పాటు డ్రగ్ కంట్రోల్ బృందాలు సంయుక్తంగా సోదాలు చేపడుతున్నారు. దాదాపు 100 బృందాలు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు, దాడులు చేస్తున్నాయి. విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి.
మెడికల్ షాపుల్లో మందుల దుర్వినియోగం, నకిలీ మందులు, కాలం తీరిన మెడిసిన్స్ విక్రయాలపై ఆరా తీస్తూ సోదాలు జరుపుతున్నారు అధికారులు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, పర్మిషన్ లేని మందులు అమ్మడంపై డ్రగ్ కంట్రోల్ అధికారులకు, ప్రభుత్వానికి ఈ మధ్య ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో డీజీపీ అదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఒకేరోజు వంద టీమ్ లు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.
Also Read : జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కలకలం, దేశవ్యాప్తంగా రేగిన దుమారం.. ఎవరీ యశ్వంత్ వర్మ?
నకిలీ మందులు, కాలం చెల్లిన మెడిసిన్స్ అమ్మకాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుమతి లేని మందులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. మెడికల్ షాపుల్లో మత్తు పదార్ధాల అక్రమ అమ్మకాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ గరుడను నిర్వహించారు. ఐజీ ఈగల్ టీమ్, ఎన్ ఫోర్స్ మెంట్ బృందం, లోకల్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా వంద టీమ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని మెడికల్ షాపుల్లో దాడులు చేశారు. మెడికల్ షాపులతో పాటు మెడికల్ ఏజెన్సీల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మెడికల్ షాపులు అనుమతి లేని మందులు, మత్తు పదార్ధాలు కలిగిన మందులను, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకరమైన మందులను విక్రయిస్తున్నారనే ఆరోపణలతో అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక బృందాలు మెడికల్ షాపులు, ఏజెన్సీలలో తనిఖీలు చేశాయి. నకిలీ మందులు, కాలం తీరిన మందులు, ప్రమాదకర మెడిసిన్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై అధికారులు కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందులను సీజ్ చేశారు.