గోవిందా.. గోవిందా.. : సహజశిల వేంకటేశ్వరుడికి అభిషేకం

  • Publish Date - April 13, 2019 / 10:05 AM IST

తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు కొలువై ఉన్న ఏడు కొండలలో సహజ రూపంలో  వెలసిన స్వామి వారికి  శ్రీవికారి నామ సంవత్సరం  ఉగాది సందర్భంగా భక్తులు గజమాల వేసి అభిషేకం నిర్వహించారు.  తిరుమలలోనిస్ధానిక భక్తులు, ఆకాశ గంగ నుంచి నీరు తీసుకు వచ్చి వాటితో పాటు పాలు,పెరుగు,తేనె,నెయ్యితో అభిషేకం చేసి గజమాలతో స్వామిని అలంకరించారు. సహజ శిలకు అభిషేక చేస్తున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియమైన వాహనం.. గరుడ పక్షివచ్చి అక్కడ చక్కర్లు కొట్టిస్వామి వారిని దర్శించుకోవటంతో భక్తులు పులకరించిపోయారు.