జూన్ నెలలో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ 2024 నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ 2024 నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత‌సేలు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also Read : Nara Lokesh : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ దంపతులు

  • 21వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌ దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటా టీటీడీ విడుద‌ల చేయనుంది.
  • 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు టీటీడీ విడుదల చేయనుంది.
  • 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటా విడుద‌ల చేస్తారు.
  • 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌ టికెట్ల కోటాను టీటీడీ విడుద‌ల చేయనుంది.
  • 25న ఉద‌యం 10గంట‌లకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను టీటీడీ భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచనుంది.
  • 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను టీటీడీ విడుద‌ల చేయనుంది.
  • భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు