Nara Lokesh : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ దంపతులు

నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.

Nara Lokesh : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ దంపతులు

Nara Lokesh

Updated On : March 21, 2024 / 10:49 AM IST

Nara Lokesh Visit Tirumala Temple : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్ వెంట ఆయన సతీమణి నారా బ్రాహ్మిణి, మాతృమూర్తి నారా భువనేశ్వరి ఉన్నారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాదానికి రూ. 38లక్షల డీడీని ఒకరోజు విరాళంగా టీటీడీకి నారా లోకేశ్ కుటుంబ సభ్యులు అందజేశారు.

Nara Lokesh Brahmini and Nara Bhuvaneshwari visited Tirumala Temple

నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి దర్శనానంతరం దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకొని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు నారా లోకేశ్, బ్రాహ్మిణి, దేవాన్ష్, నారా భువనేశ్వరిలు అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు. బుధవారం రాత్రే నారా లోకేశ్ దంపతులు, నారా భువనేశ్వరి తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథిగృహం వద్ద టీటీడీ రిసెప్షన్ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బసచేసి ఉదయాన్నే స్వామివారిని దర్శించుకున్నారు.

 

Nara Family

 

Nara Lokesh family Visit Tirumala Temple