×
Ad

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.. పదిరోజులు అందుకు అవకాశం..

Tirumala : వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది.

Tirumala

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది. ఈ సంవత్సరం డిసెంబర్ 30న ఈ దర్శనం ప్రారంభమవుతుంది. 2026 జనవరి 8వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో భక్తులు.. స్వామి వారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవచ్చు.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని టీటీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టోకెన్లు జారీ ఎప్పుడు అనేది త్వరలో చెబుతామని చెప్పారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Also Read: Rain Alert : బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలుపడే అవకాశం.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?

తిరుమల శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు చెప్పారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్ లైన్ కోటా విడుదల చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తొమ్మిది రకాల సేవలు అందుబాటులోకి తేనున్నట్లు ఈవో సింఘాల్ తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణ, కంపార్టుమెంట్ల పర్యవేక్షణ, ప్రతిభక్తుడి డేటా సేకరణకు ఈ సెంటర్ ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా.. భక్తుల సూచనల మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో 5వేల భజన మందిరాలు నిర్మిస్తామని తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో రానున్న పదేళ్లలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. టీటీడీ దేవాలయాల్లోని ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీకి తగినట్లుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అదేవిధంగా.. ఈ నెల 27వ తేదీ నుంచి అమరావతి పరిధిలోని వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకారం, కల్యాణోత్సవం మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఈవో చెప్పారు.