Tirumala Srivaru : ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు టీటీడీ విడుదల చేయబోతోంది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్‌కు 2వేల 500 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది. మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చని తెలిపింది.

Tirumala Srivaru : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు టీటీడీ విడుదల చేయబోతోంది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్‌కు 2వేల 500 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది. మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చని తెలిపింది.

ఆగస్టు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు.

TSRTC : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసి గుడ్‌న్యూస్

పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 చేరుకోవాలి. టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. మరోవైపు టీటీడీ తరఫున నిర్వహించే..కల్యాణమస్తు కార్యక్రమం వచ్చే నెల 7న ఏపీ వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు