TSRTC : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసి గుడ్‌న్యూస్

తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు. రిటర్న్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే దర్శనం టికెట్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఆర్టీసి కల్పించింది.

TSRTC : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసి గుడ్‌న్యూస్

Tsrtc

TSRTC good news : తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్‌న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు. రిటర్న్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే దర్శనం టికెట్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఆర్టీసి కల్పించింది. ఆర్టీసి తీసుకున్న నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తిరు‌మల శ్రీవారి భక్తుల కోసం గురువారం(జులై 8,2022)వ తేదీన నిజా‌మా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి ఏసీ బస్సు‌లను ప్రారం‌భించింది. నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్‌ బాజి‌రెడ్డి గోవ‌ర్ధన్‌ ఈ కొత్త బస్సు సర్వీసును జెండాఊపి ప్రారంభించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులకు మరిన్ని సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించింది. ప్రతిరోజు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటుతో పాటు శ్రీవారిని దర్శించు కోవాలనుకునే భక్తులకు బస్‌ టికెట్‌, శీఘ్ర దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పిస్తున్నారు.

Tirumala : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

టీటీడీ ప్రత్యేకంగా టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణీకులకు రోజువారీ 300, ప్రత్యేక శీఘ్ర దర్శన వెయ్యి మందికి టిక్కెట్లను జారీ చేయనుందని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ లభిస్తుందన్న ఆశాభాశాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్‌ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉందన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నట్ల తెలిపారు. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం ఉందన్నారు.

Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు

అయితే బస్‌ టికెట్‌తో పాటే దర్శన టికెట్‌నూ బుక్‌ చేసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని గోవర్దన్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వీక్షించాలన్నారు. కనీసం వారం ముందు www.tsrtconline.in నుంచి టికె‌ట్లను బుక్‌ చేసు‌కో‌వా‌లని అధికారులు సూచించారు. ఈ నెల 1న హైద‌రా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి ఆర్టీసీ సేవలు మొద‌లైన సంగతి తెలిసిందే.