Tirumala : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.

Tirumala : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Pournami Garuda Seva Tirumala

Updated On : July 13, 2022 / 9:16 PM IST

Tirumala :  తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురుపౌర్ణమి కావడంతో విశేషంగా భక్తులు విచ్చేశారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు.