Srivari Vaikuntha Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు

తెలుగు రాస్ట్రాల్లో ఆలయాల్లో కలకలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.

tirumala

Srivari Vaikuntha Darshan : తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కలకలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్చకులు ధనుర్మాస ప్రత్యేక పూజా, కైంకర్యాలు, నివేదనలు చేశారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్త జనం పోటెత్తారు. అర్చకులు శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్ధరాత్రి 12.5 గంటలకు దర్శనాలు ప్రారంభించారు.

ముందుగా టీటీడీ పాలక మండలి, అధికారులు వైకుంఠ ద్వారా ప్రదక్షిణ చేశారు. అనంతరం ప్రముఖులు వైకుంఠ ద్వారా దర్శనం చేశారు. అత్యంత ప్రముఖులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు పొందిన భక్తులను
దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచే సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

Vaikuntha Ekadashi Darshan Tickets : తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లు జారీ

ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే ఆన్ లైన్ లో రూ.300, ఆఫ్ లైన్ లో ఎస్ఎస్ డీ టోకెన్లు పొందారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 11వ తేది వరకు భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా వీవీఐపీ, వీఐపీ దర్శనం తర్వాత ఉదయం 5 గంటల నుంచి సామాన్యు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.