Vaikuntha Ekadashi Darshan Tickets : తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లు జారీ

తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతిలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో టీటీడీ ముందుగానే టిక్కెట్ల జారీని ప్రారంభించింది.

Vaikuntha Ekadashi Darshan Tickets : తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లు జారీ

TIRUPATI

Vaikuntha Ekadashi darshan tickets : తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతిలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లను జారీ చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి టికెట్లను పంపిణీ చేస్తామని మొదట ప్రకటించారు కానీ భక్తుల పడిగాపులను చూసి తెల్లవారుజాము నుంచే టిక్కెట్ల జారీలు ప్రారంభించారు.

రేపటి నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. రోజుకు 45 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల 50వేల దైవ దర్శనం టిక్కెట్లను జారీ చేయనున్నారు. తిరుపతిలో అలిపిరి, భూదేవి కాంప్లెక్స్ వద్ద రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న రెండు, మూడు సత్రాలు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లో వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లు జారీ చేస్తున్నారు.

Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం

అలాగే ఇందిరా మైదానం, జీవకోని జిల్లా హైస్కూలు, అదేవిధంగా బైరాగి పట్టణంలోని రామానాయుడు గూడ్స్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జెడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద కౌంటర్లలో టిక్కెట్లను ఇస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల రద్దీతో టీటీడీ ముందుగానే టిక్కెట్ల జారీని ప్రారంభించింది.