Tirumala Vaikunta Ekadashi Darshanam
Tirumala Vaikunta Ekadashi Darshanam : నవంబర్ 10న తిరుమల వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజులకు ఆఫ్ లైన్ లో ప్రత్యేక దర్శనం రూ.2.25 లక్షలు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు రూ.20 వేలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు.
తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు. భక్తులకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరకు అందివ్వడానికి తిరుమలలో మూడు రెస్టారెంట్లను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇచ్చామని పేర్కొన్నారు.
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్
శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు రిషబ్ పంత్ మరియు అక్షర్ పటేల్
ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న శ్రీవారిని భక్తులు 59,335 దర్శించుకున్నారు.
గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.