తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై వేటు

ఈ వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశ, అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి కూడా సస్పెన్షన్ కు గురయ్యారు.

Tirupati Fake Votes Issue

Tirupati Fake Votes : తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో దొంగ నోట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. పోలీసు అధికారులపై కొరడా ఝళిపించింది. ఈసీ ఆదేశాల మేరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు.

Also Read : వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది

ఈస్ట్, వెస్ట్ పోలీస్ స్టేషన్ల సీఐలు శివప్రసాద్ రెడ్డి, శిప్రసాద్ తో పాటు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే అలిపిరి సీఐ దేవేంద్రను వీఆర్ కు బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశ, అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి కూడా సస్పెన్షన్ కు గురయ్యారు.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?