AP CM Jagan: నేడు జగనన్న విద్యాదీవెన.. మదనపల్లెలో బటన్ నొక్కనున్న సీఎం జగన్..

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొని బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

AP CM Jagan: ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు నిధులు విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. మొత్తం రూ. 694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. దీనిద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ. 12,401 కోట్లు విడుదల చేసినట్లవుతుంది.

AP CM YS Jagan: గుడ్‌న్యూస్‌.. ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి కొత్త‌గా 809 చికిత్స‌లు.. ప్రారంభించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ఫీజులను ప్రతీ త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఎప్పటినిధులు అప్పుడే అందిస్తోంది. ఐటీ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది.

Jagan slams chandrababu: చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు: సీఎం జగన్

సీఎం జగన్ పర్యటన ఇలా..

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొని బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ ఇంటి వద్ద నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వెళతారు. అక్కడి నుంచి 9.30 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి విమానాశ్రయంకు 10.20కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30 నిమిషాలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో మదనపల్లి బిటి కాలేజీకి వెళతారు. అక్కడి నుంచి 11.00 గంటలకు మదనపల్లి బి. టి కాలేజి హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. ఉదయం 11.10 నిమిషాలకు బిటి కాలేజి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణం టిప్పు సుల్తాన్ మైదానం కదిరి రోడ్ మార్గం లో 11.30 నిమిషాలకు చేరుకుంటారు. 11.35 నిమిషాలు నుంచి 12.45 నిమిషాలు వరకు జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు.12.55 నిమిషాలకు బి. టి కాలేజి గ్రౌండ్‌కు చేరుకోనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నేతలు కలిసి 1.10 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా బీటీ కాలేజీ నుంచి తిరుపతి విమానాశ్రయంకు బయల్దేరనున్నారు. 1.55 తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 2.45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి సీఎం ఇంటికి పయనమవుతారు.

ట్రెండింగ్ వార్తలు