Tdp
Atchannaidu: టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన టమోటా పంట అగ్నికి ఆహుతైంది. చేతికందివచ్చిన పంటతో సహా పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతిఅయ్యాయి. పొలంలో పంట తగలబడడంపై బాధిత రైతు భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ సుమారు 4 లక్షల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రాజకీయ కక్షతో తమ పొలానికి నిప్పు పెట్టారని భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని స్థానిక వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగతంగా దెబ్బతీశారని బాధితుడు పేర్కొన్నాడు.
Also read: CM Jagan : 30.76 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.. పేదలకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ : సీఎం జగన్
కాగా ఈఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గురువారం స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా దిగువ శితివారిపల్లెలో టీడీపీ నేతల పొలాలను దగ్ధం చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాజకీయ భావజాలాన్ని పక్కనబెడితే వారు కూడా రైతులేనన్న సంగతి ప్రత్యర్ధులు గుర్తించాలని ఆయన అన్నారు. పచ్చని పొలాల్లో నిప్పు పెట్టడం వైసీపీ రాక్షసత్వానికి అద్దం పడుతోందని..లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి సాగుచేసుకున్న టమోట, మిరప పంటలను జగన్ రెడ్డి గూండాలు తగలబెట్టారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read: Minister KTR : బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్.. ‘దమ్ముంటే గంగుల కమలాకర్ పై పోటీ చెయ్’
తన ఫ్యాక్షన్ బుద్ధిని జగన్ రెడ్డి రాష్ట్ర మంతా ఎక్కిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాకా జగన్ రెడ్డి అమరావతిలో అరటి తోటలు తగలబెట్టించారు. నాడు ఆయన నేర్పిన కుసంస్కారాన్ని నేడు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు అమలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పంట నష్టపోయిన బాధితులకు ప్రభుత్వమే పంట నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ పరంగానూ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అన్ని విధాలా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు అన్నారు.
Also read: Ambati Rambabu: ప్రజా సమస్యలు చర్చించే శాసనసభ ఒక పవిత్రమైన దేవాలయం: ఎమ్యెల్యే అంబటి రాంబాబు