CM Jagan : 30.76 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.. పేదలకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ : సీఎం జగన్

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం మహాయజ్ఞం చేశామని తెలిపారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు.

CM Jagan : 30.76 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.. పేదలకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ : సీఎం జగన్

Cm Jagan

AP CM JAGAN : అర్హులు అయితే చాలు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. వివక్ష, అవినీతి లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై గురువారం (మార్చి17,2022) స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు.

తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. 71,811 ఎకరాల విలువ రూ.25 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు.

CM Jagan : మద్యపానం తగ్గించాలన్నదే మా లక్ష్యం : సీఎం జగన్

రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం మహాయజ్ఞం చేశామని తెలిపారు. ప్రతీ కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం పూర్తైతే జగన్ కు మంచి పేరు వస్తుందని.. కోర్టులో చంద్రబాబు కేసులు వేయించారని ఆరోపించారు.