CM Jagan : మద్యపానం తగ్గించాలన్నదే మా లక్ష్యం : సీఎం జగన్

కల్తీ మద్యం తయారీదారుల్ని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

CM Jagan : మద్యపానం తగ్గించాలన్నదే మా లక్ష్యం : సీఎం జగన్

Jagan Cm

adulterated liquor : రాష్ట్రంలో మద్యపానం తగ్గించాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 43 వేల బెల్టు షాపుల్ని లేకుండా చేశామని తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ గతంలో లాభాపేక్షతో విచ్చలవడిగా మద్యం అమ్మారని పేర్కొన్నారు. ఇప్పుడు లాభాపేక్ష లేకుండా గవర్నమెంట్ మద్యం షాపులను నడిపిస్తోందన్నారు. తాము తీసుకున్న చర్యలతో లిక్కర్ వినియోగం తగ్గిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

కల్తీ మద్యం తయారీదారుల్ని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కల్తీ మద్యం తయారీదారులపై 13 వేల కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయని తెలిపారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయమైన రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

మరోవైపు అసెంబ్లీ సమావేశాల నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ సెషన్ అంతా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అచ్చెన్నాయుడు, నిమ్మల, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీరాంజనేయస్వామిలు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

తమను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ స్పీకర్ తో వారు వాగ్వాదానికి దిగారు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో టీడీపీ సభ్యులు ఇలా చేయడం కరెక్టు కాదని స్పీకర్ అన్నారు. వెంటనే టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్ కు సూచించారు. సోమవారం(మార్చి14, 2022)న సభ ప్రారంభమవ్వగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మిస్టరీ మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

అవన్నీ కల్తీ సారా మరణాలేనని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడకు వెళ్లనున్నారు. దీనిపై అసెంబ్లీలో లేవనెత్తారు. కావాలనే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని, చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, టీడీపీ సభ్యులు సరైన రీతిలో రావడం లేదని తెలిపారు. సహజ మరణాలు సంభవిస్తే.. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తోందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు ఏకంగా వెల్ లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియాన్నే ఎక్కడంపై అసెంబ్లీలో కలకలం రేపింది.

అంతేగాకుండా చేతుల్లో ఉన్న పేపర్లను చించి స్పీకర్ పై వేయడం వైసీపీ తీవ్రంగా పరిగణించింది. సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. జంగారెడ్డి గూడెంలో జరుగుతున్న మరణాలపై సీఎం జగన్ ఆరా తీశారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను మంత్రులు ఆయనకు వివరించారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.