AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతుంది. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారు.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

Ap Cabinet (1)

AP Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణపై ఏపీలో ప్రస్తుతం హాట్‌ డిబేట్‌ నడుస్తోంది. ఎవరి పదవి ఊడుతుంది.. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కొద్ది మంది మినహా మొత్తం మంత్రి వర్గాన్ని మార్చే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నారు. ముందు చెప్పినట్లుగానే కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వనున్నారు. అయితే తన టీమ్‌ను ఎంచుకోవడంలో కొత్త జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి నేతల ప్రాతినిధ్యం ఉండేలా సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు.

అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా కొందరు మంత్రుల పదవులు మాత్రం కొనసాగనున్నట్టు సమాచారం. ఇక పదవి పోగొట్టుకోనున్న ప్రస్తుత మంత్రులకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. వారి పనితీరును బట్టి భవిష్యత్తులో మళ్లీ వారికి మంత్రి పదవులు దక్కుతాయని సీఎం జగన్‌ చెప్పినట్టు సమాచారం. ఇక మంత్రి పదవుల కోసం ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ఆశావాహులు ఎవరికి వారే తమకు మంత్రి పదవి దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

CM Jagan : కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతుంది. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారు. ఏడుగురు మంత్రులు కొత్త కేబినెట్‌లోనూ కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యానారాయణ కొత్త కేబినెట్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.

కురసాల కన్నబాబు, పేర్ని నాని, కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం కొత్త మంత్రివర్గంలో కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సీఎం జగన్ 2024 ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. సీనియర్‌ మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.

AP Cabinet : ఎన్నికల మూడ్‌‌లోకి ఏపీ ప్రభుత్వం..15న వైసీపీఎల్పీ భేటీ

రాష్ట్రంలోని అశావహుల్లో కర్నూలు జిల్లా నుంచి ఆర్థర్ (ఎస్పీ), బాలనాగి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. అనంపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రబారెడ్డి. కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా ఉన్నారు.

గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫా, మర్రి రాజశేఖర్, విడదల రజిని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, జోగి రమేష్ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), పొన్నడా సతీశ్, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా ఉన్నారు.

AP Cabinet Expansion : త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ.. ఆశావహులు వీరే..!

విశాఖ జిల్లా నుంచి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం ఉన్నారు. అయితే తమ్మినేని సీతారం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.