AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా...

AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

Ap Assmbly Speeker

AP Assembly Suspends Five TDP Members : ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ సెషన్ అంతా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల, పయ్యావుల, గోరంట్ల, వీరాంజనేయస్వామిలు ఉన్నారు. తమను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ స్పీకర్ తో వారు వాగ్వాదానికి దిగారు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో టీడీపీ సభ్యులు ఇలా చేయడం కరెక్టు కాదని స్పీకర్ తెలిపారు. వెంటనే టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్ కు సూచించారు.

Read More : Janga Reddy Gudem : స్పీకర్‌‌పై పేపర్లు వేసిన టీడీపీ సభ్యులు.. ఖండించిన వైసీపీ

2022, మార్చి 14వ తేదీ సోమవారం సభ ప్రారంభం కాగానే.. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మిస్టరీ మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇవన్నీ కల్తీ సారా మరణాలేనని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్కడకు వెళ్లనున్నారు. దీనిపై అసెంబ్లీలో లేవనెత్తారు. కావాలనే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారరని, ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ..టీడీపీ సభ్యులు సరియైన రీతిలో రావడం లేదని తెలిపారు. సహజ మరణాలు సంభవిస్తే.. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తోందని తెలిపారు.

Read More : West Godavari : జంగారెడ్డిగూడెంకు బాబు..డెత్ మిస్టరీ పొలిటికల్ టర్న్, నాటు సారాయే కారణమా ?

టీడీపీ సభ్యులు ఏకంగా వెల్ లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం ఎక్కడం అసెంబ్లీలో కలకలం రేపింది. అంతేగాకుండా చేతుల్లో ఉన్న పేపర్లను చించి స్పీకర్ పై వేయడం వైసీపీ తీవ్రంగా పరిగణించింది. సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టడం.. స్పీకర్ ఆమోదించారు. జంగారెడ్డి గూడెంలో జరుగుతున్న మరణాలపై సీఎం జగన్ ఆరా తీశారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను మంత్రులు ఆయనకు వివరించారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.